సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Nov 03, 2020 , 02:13:17

ధరణి సేవలు ప్రారంభం

ధరణి సేవలు ప్రారంభం

భూపాలపల్లి : ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను భూపాలపల్లి తహసీల్దార్‌  కార్యాలయంలో తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఎం అశోక్‌ కుమార్‌ ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు మేనం అమృతమ్మ తనకున్న రెండు గుంటల భూమిని తన చిన్న కుమారుడు మేనం రాజేందర్‌కు గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. జిల్లా కేంద్రానికి చెందిన భాస్కర్ల సాయిరాం భూపాలపల్లి మండలం గొర్లవీడు శివారులో అదే గ్రామానికి  చెందిన మంచిపల్లి మహేశ్‌ వద్ద ఎకరం భూమి కొనుగోలు చేశారు. వీరు ధరణి స్లాట్‌ బుక్‌ చేసుకోగా తహసీల్దార్‌ అశోక్‌ కుమార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి రాజేందర్‌, సాయిరామ్‌కు పట్టాదారు పాస్‌ పుస్తకం ప్రతులు అందజేశారు. కాశీంపల్లి గ్రామానికి చెందిన జోరు సుధాకర్‌ ఎకరం భూమిని తన కూతురు జోరు శ్రీలత పేరుపై గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ధరణి స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారు. భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన పోలు తిరుపతి తనకున్న 34 గుంటల వ్యవసాయ భూమిని తన కుమారుడు పోలు ప్రతాప్‌ పేరుపై గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ధరణి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోగా తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ కే రవీందర్‌రావు, ఈడీఎం శ్రీకాంత్‌, ఆర్‌ఐ దేవేందర్‌ , సీనియర్‌ అసిస్టెంట్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

పలిమెలలో..

పలిమెల : తహసీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న ధరణి రిజిస్ట్రేషన్ల పక్రియను ఆర్డీవో శ్రీనివాస్‌ పరిశీలించారు. తహసీల్దార్‌, డీటీ, ఆపరేటర్‌కు పలు సూచనలు చేశారు. మండలంలోని ముకునూరు గ్రామానికి చెందిన వ్యవసాయ భూమిని ధరణి పోర్టల్‌లో మొదటి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తహసీల్దార్‌ మంజుల తెలిపారు. కార్యక్రమంలో డీటీ సూర్యనారాయణ, ఆర్‌ఐ సౌభాగ్యవతి, సిబ్బంది ఉన్నారు. 

చిట్యాలలో..

చిట్యాల : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది. తహసీల్దార్‌ కార్యాలయంతో ధరణిలో మొదటి రిజిస్ట్రేషన్‌ మండలంలోని ముచినిపర్తికి చెందిన బోనగాని సదయ్య తనకున్న ఎకరం భూమిని గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ కింద తన కుమార్తె నవిత పేరుపై చేయించారు. రిజిస్ట్రేషన్‌ పత్రాలను జాయింట్‌ స బ్‌ రిజిస్ట్రార్‌(తహసీల్దార్‌) ఎండీ షరీఫ్‌ నవితకు అందజేశారు. 

టేకుమట్లలో..

టేకుమట్ల : తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా మండలంలోని రామకృష్ణాపూర్‌(టీ) గ్రామానికి చెందిన సల్పాల సరిత మొదటి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అదే గ్రామానికి చెందిన నేతుల రాజయ్య వద్ద 2.01 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి ఆదివారం ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. కాగా సోమవారం అమ్మిన, కొన్న వ్యక్తుల సమక్షంలో తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రామారావు రిజిస్ట్రేషన్‌ చేశారు. అలాగే గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన సొత్కు సంధ్య ఆరెపల్లి వెంకటలక్ష్మి వద్ద 22 గుంటల భూమి కోనుగోలు చేయగా, సోమవారం ఆమె పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశారు.  ధరణితో గంటల్లో రిజిస్ట్రేషన్‌ అవుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

VIDEOS

logo