ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Nov 03, 2020 , 02:13:15

తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం

తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం

కమలాపూర్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో ఎలాంటి తరుగులేకుండా కొనుగోలు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కమలాపుర్‌ మండల పరిధి మర్రిపెల్లి, మర్రిపెల్లిగూడెం, వంగపల్లి, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజ్‌పల్లి, ఉప్పల్‌, ఉప్పలపల్లి గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గన్నీసంచుల కొరత, హ మాలీల సమస్య లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు కాంటాలు వేసి రైస్‌మిల్లులకు తరలిస్తామని, మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకుని పంపించేలా ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు కొనుగోళ్లలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఉప్పలపల్లి గ్రామంలో పల్లెప్రకృతి వనంలో మంత్రి ఈటల రాజేందర్‌ మొక్క నాటారు. ఆయన వెంట కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, ఎంపీపీ రాణీ, జడ్పీటీసీ కల్యాణి, మంత్రి సోదరుడు ఈటల భద్రయ్య, సర్పంచ్‌లు రజిత, కిరణ్మయి, కమలమ్మ, రవీందర్‌రెడ్డి, రవీందర్‌, రమేశ్‌, దేవేందర్‌రావు, ఉమ, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


VIDEOS

logo