మంగళవారం 19 జనవరి 2021
Jayashankar - Nov 01, 2020 , 05:18:48

ప్రతిభా అన్వేషణ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

 ప్రతిభా అన్వేషణ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి కలెక్టరేట్‌, అక్టోబర్‌ 31 : జాతీయ విద్యా పరిశోధన మండలి దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న  ప్రతిభా అన్వేషణ పరీక్షకు గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో డాక్టర్‌ అబ్దుల్‌ హై, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి బానోత్‌ జుమ్ము శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ 10వ తేదీలోగా రూ. 100 పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తును నవంబర్‌ 12వ తేదీలోగా  ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రెండు వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తారని వివరించారు. ఇంటర్‌ పూర్తయ్యే వరకు నెలకు రూ.1250, డిగ్రీ, పీజీ వరకు రూ.2000, యూజీసీ నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ వరకూ స్కాలర్‌షిప్‌ అందజేస్తారన్నారు. వివరాలకు http//bse. telangana.gov.in లో చూడాలని ఆయన పేర్కొన్నారు.