గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 30, 2020 , 02:24:23

100మిలియన్‌ టన్నుల ఉత్పత్తే లక్ష్యం

100మిలియన్‌ టన్నుల ఉత్పత్తే లక్ష్యం

భూపాలపల్లి: రానున్న ఐదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే దిశగా సింగరేణి సంస్థ పయనిస్తున్నదని కొత్తగూడెం కార్పొరేట్‌ జీఎం(పీపీ) పాలకుర్తి సత్తయ్య అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి, ఉత్పాదకతలు ఏవిధంగా ఉన్నాయి, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల స్థితిగతులపై భూపాలపల్లి జీఎం ఈసీహెచ్‌ నిరీక్షన్‌రాజ్‌ అధ్యక్షతన ఏరియా అధికారులతో జీఎం పీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కరోనాతో నష్టపోయిన ఉత్పత్తిని ఎలా భర్తీ చేయాలనే విషయమై అధికారులకు సూచనలు చేశారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితోపాటు వివిధ ప్రత్యామ్నాయాలతో ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు రచిస్తున్నదని అన్నారు. భవిష్యత్తులో బొగ్గుకు డిమాండ్‌ తగ్గే అవకాశం ఉన్నందున సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేయడం, ఇసుకను విక్రయించడం ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం జి.రఘుపతి, ఏజీఎం(ఐఈడీ) ఎస్‌.జ్యోతి, ఏజెంట్‌ బీవీ.రమణ, పర్సనల్‌, ఈఅండ్‌ఎం, ఎన్విరాన్‌మెంట్‌ డీజీఎంలు మంచాల శ్రీనివాస్‌, రమేశ్‌బాబు, రాంకుమార్‌, కేటీకే ఓసీ 3 పీవో ఆర్‌.విజయప్రసాద్‌, ఏరియా సర్వే ఆఫీసర్‌ రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.