ఆదివారం 29 నవంబర్ 2020
Jayashankar - Oct 30, 2020 , 02:24:25

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

భూపాలపల్లి: ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని భూపాలపల్లి ఏరియా సింగరేణి పాఠశాల కరస్పాండెంట్‌, డీజీఎం పర్సనల్‌ మంచాల శ్రీనివాస్‌ అన్నారు. గురువారం స్వచ్ఛతా మహా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు స్థానిక సింగరేణి పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కరస్పాండెంట్‌ మాట్లాడుతూ పరిసరాలు పచ్చగా ఉంటే ప్రజల జీవన మనుగడ బాగుంటుందని, శ్వాస సంబంధిత వ్యాధులు దరిచేరవని అన్నారు. అంతకుముందు విద్యార్థులతో స్వచ్ఛతా మహా ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవితేజ, సీనియర్‌ పీవో రాజేశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.