శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jayashankar - Oct 30, 2020 , 02:25:36

అడవుల నరికివేతను అరికట్టాలి

అడవుల నరికివేతను అరికట్టాలి

జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తేతెలంగాణ : కలప, వెదురు స్మగ్లింగ్‌ నివారణకు రెండు రాష్ర్టాల అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోనున్నట్లు తె లంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రొ య్యూరు శోభ అన్నారు. గురువారం భూపాలపల్లిలోని టీఎస్‌ జెన్‌కో గోదావరి అతిథి గృహంలో అం తర్రాష్ట్ర అటవీ, వన్యప్రాణి సంరక్షణపై వర్క్‌ షాప్‌, సమన్వయ సమావేశం సీసీఎఫ్‌ ఎం జే అక్బర్‌ అధ్యక్షతన జరిగింది. కలప అక్రమ రవాణా కేంద్రాలను గుర్తించాలని, అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ స్మగ్లర్ల ఆట కట్టించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  పోలీస్‌ శాఖ సహకారంతో పులుల సంరక్షణకు ప్రత్యేక  కార్యాచరణను  రూపొందిస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్‌, మహారా ష్ట్ర సరిహద్దుల నుంచి 15-20 సంవత్సరాల తర్వా త జయశంకర్‌, ములుగు జిల్లాల అడవుల్లోకి పెద్ద పులులు వచ్చాయన్నారు. పులుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై సరిహద్దు రాష్ర్టాల పోలీస్‌, అటవీశాఖ అధికారులతో చర్చిస్తామని, పులుల సంచారం ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి సాగుతున్నదనే అంశంపై అధ్యయనం చేయనున్నట్లు వివరించారు. జంతువుల వేట నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో మూడు రాష్ర్టాల మధ్య ప్రతి నెలా రేంజ్‌ స్థాయి, రెండు నెలలకు ఒక సారి డివిజన్‌ స్థాయి, 6 నెలలకు  సర్కిల్‌ స్థాయి, సంవత్సరానికి ఒక సారి రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో తాడోబా, ఇంద్రావతి, కవ్వాల్‌, కిన్నెరసాని టైగర్‌ జోన్ల డైరెక్టర్లు పులుల సంరక్షణకు చేపడుతున్న పలు అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో  అటవీశాఖ అదనపు ప్రధాన సంరక్షణాధికారి  స్వర్గం శ్రీనివాస్‌, నేషనల్‌  కన్జర్వేటర్‌ ఆఫ్‌ టైగర్‌ జోన్‌ డైరెక్టర్‌ మురళీతో పాటు కలెక్టర్లు అబ్దుల్‌ అజీం, కృష్ణ ఆది త్య, రామగుండం సీపీ సత్యనారాయణ, 13 జిల్లాలకు చెందిన పోలీస్‌, అటవీశాఖ అధికారులు తది తరులు పాల్గొన్నారు.