గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 29, 2020 , 02:06:12

వివాహిత ఆత్మహత్యాయత్నం

వివాహిత ఆత్మహత్యాయత్నం

చిట్యాల : వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్‌ కొత్తవాడకు చెందిన భాగ్యలక్ష్మికి చిట్యాల మండల కేంద్రానికి చెందిన అంకం సురేశ్‌తో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ సందర్భంగా కట్నకానుకలు సమర్పించినప్పటికీ అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామ, ఆడబిడ్డలు భాగ్యలక్ష్మిని వేధింపులకు గురి చేసేవారు. వారి బాధలు భరించలేక మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే ఆమెను వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. బాధితురాలి సోదరుడు గణేశ్‌ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త అంకం సురేశ్‌, అత్త నర్సమ్మ, మామ చంద్రయ్య, ఆడబిడ్డ శ్రీదేవి, ఆమె భర్త రాజమొగిలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.