ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Oct 29, 2020 , 02:06:38

ముగిసిన షటిల్‌ టోర్నమెంట్‌

ముగిసిన షటిల్‌ టోర్నమెంట్‌

మంగపేట : మండల కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట మండలాల స్థాయి షటిల్‌ టోర్నమెంట్స్‌ బుధవారం ముగిశాయి. మొత్తం 36 టీమ్‌లు పాల్గొనగా మంగపేటకు చెందిన శేషు, భార్గవ్‌ ప్రథమ స్థానం, కాక సమ్మయ్య, చల్లా రాంకీ ద్వితీయ స్థానం, కొంగాల గ్రామానికి చెందిన సాయి టీమ్‌ తృతీయ స్థానంలో నిలిచింది. నిర్వాహకులు విజేతలకు నగదుతో పాటు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సమ్మయ్య, బానోత్‌ వీరులాల్‌, తోట రమేశ్‌, చింతల శైలేందర్‌, కురిమిల్లా శ్యామ్‌, పాగి అనిల్‌కుమార్‌, తాళ్లపెల్లి వీరకిశోర్‌, చల్లా రమణయ్య, కాటూరి జీవన్‌, ఆగబోయిన రామారావు, కోడెం నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo