ఆన్‌లైన్‌లోకి రేషన్ డీలర్లు!

- ఈపీడీఎస్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు
శాయంపేట: రేషన్ డీలర్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లోకి తెస్తున్నది. ప్రత్యేకంగా తెచ్చిన ఈపీడీఎస్ సాఫ్ట్‌వేర్‌లో న మోదు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఫార్మాట్లో రెవెన్యూ అధికారులు ఆన్లైన్ ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే నిత్యావసర సరుకులను చౌక దుకాణాల ద్వారా డీలర్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వర కు వారి సమగ్ర వివరాలు ఆన్లైన్లో లేకపోవడంతో నమోదుకు సర్కారు ఆదేశించింది. డీలర్లకు సంబంధించి ఇద్దరి నామినీలు, ఆధార్ నంబర్, విద్యార్హత, పుట్టిన తేదీ, వార సులు, బ్యాంకు ఖాతా పొందుపర్చాల్సి ఉన్నది. అలాగే డీల ర్ ఎలా భర్తీ అయ్యారో తెలియజేయాలి. కంపాస్లోనా, డైరెక్టుగా అపాయింట్ అయ్యారా, తాత్కాలికమా, డీలర్‌పై ఏవైనా కేసులున్నా అని నమో దు చేయాలి. వర్కింగా, సస్పెన్షనా, అబ్స్కాండింగా అనే విషయాలను ఫార్మాట్లో పొం దుపర్చారు.
అయితే డీలర్లకు ప్రభుత్వం కమీషన్ చెల్లిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌కు శ్రీకారం చుట్టినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఏండ్ల తరబడి డీలర్లు కొ న్ని చోట్ల ఇన్‌చార్జీలే ఉండడం సమస్యగా మారుతోంది. దీం తోపాటు పలు చోట్ల డీలర్లు ఒకరి పేరుపై ఉంటే మరొకరు నిర్వహిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇది నిబంధనల కు విరుద్ధమైనా పర్యవేక్షణ కొరవడడంతో ఎలాంటి చర్యలు తీసు కోవడంలేదని చెబుతున్నారు. ఇన్చార్జిలతో రెండు షాపుల నిర్వహణ కష్టంగా మారుతోందంటున్నారు. ప్రతి నెల 15లోగా సరుకులను లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చే యాల్సి ఉన్నది. కానీ మరో గ్రామానికి వచ్చి డీలర్ ఒకటి, రెండు రోజులే సరుకులు ఇస్తున్నాడు. దీంతో లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఐదు చోట్ల ఇన్చార్జి డీలర్లతో నిర్వహిస్తున్నట్లు డీటీ భద్రు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలిసారి రేషన్ డీలర్ల సమగ్ర వివరాలను ఈపీడీఎస్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!