శనివారం 16 జనవరి 2021
Jayashankar - Oct 28, 2020 , 02:02:36

రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలి

రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలి

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం

కాశీబుగ్గ, అక్టోబర్‌ 27: రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలని వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం సూచించారు.   మార్కెట్‌లోని పత్తి, మిర్చి యార్డును చైర్మన్‌ చింతం సదానందం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పత్తిని మార్కెట్‌ యార్డు, ప్రకటిత జిన్నింగ్‌ మిల్లులకు తీసుకురావాలన్నారు. నాణ్యమైన సరుకుతో మార్కెట్‌కు వచ్చి సీసీఐ ద్వారా మంచి ధర పొందాలని కోరారు. వైస్‌ చైర్మన్‌ గుజ్జల రాంగోపాల్‌రెడ్డి, కమిటీ సభ్యులు పిన్నింటి వెంకట్‌రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.