గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 28, 2020 , 02:02:39

బ్యాంకుకు అమ్మవారి ఆభరణాలు

బ్యాంకుకు అమ్మవారి ఆభరణాలు

వరంగల్‌ కల్చరల్‌ : చారిత్రక భద్రకాళి దేవస్థానంలో సోమవారం జరిగిన కల్యాణోత్సవంతో దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. దీంతో భద్రకాళీ ఆభరణాలను మంగళవారం భద్రంగా బ్యాంకుకు తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రకాళీ అమ్మవారికి సమర్పించిన 11కిలోల 692 గ్రాముల బంగారు ఆభరణాలు కిరీటం, జటామకుటాలు, కర్ణపత్రాలను అమ్మవారికి అలంకరించి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం పోలీసు భద్రతతో హన్మకొండలోని ఆంధ్రాబ్యాంకులో ఆలయానికి కేటాయించిన లాకర్‌లో భద్రపరిచినట్లు ఈవో సునీత తెలిపారు.