బుధవారం 20 జనవరి 2021
Jayashankar - Oct 27, 2020 , 01:28:24

మెరుగైనవైద్య సేవలు అందించడమేలక్ష్యం

మెరుగైనవైద్య సేవలు అందించడమేలక్ష్యం

వెంకటాపురం(నూగూరు) అక్టోబర్‌ 26: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య అన్నారు. సోమవారం మండలంలో ఆయన  ఆకస్మికంగా పర్యటించారు.  ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్‌ దవాఖానను తనిఖీ చేశారు. వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19, ఇతర వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్‌-19  టెస్టుల సంఖ్య పెంచాలని వైద్యాధికారులకు సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి నరేశ్‌,  వైద్యసిబ్బంది ఉన్నారు.


logo