గురువారం 26 నవంబర్ 2020
Jayashankar - Oct 27, 2020 , 01:07:15

మానవీయ దృక్పథంతో విధులు నిర్వర్తించాలి

మానవీయ దృక్పథంతో  విధులు నిర్వర్తించాలి

ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ 

ములుగు,నమస్తేతెలంగాణ: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మానవీయ దృక్పథంతో విధులు నిర్వర్తించాలని పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ అన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన ములుగు, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల స్థితిగతులను, పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. మిస్సింగ్‌ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. కోర్టు స్టేఆర్డన్‌ ఉన్న కేసుల్లో ఆరు నెలల కాల పరిమితి మంచితే స్టే తొలగిపోయినట్లు భావించాలని అన్నారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా నడుచుకుంటూ ప్రతీ కేసుకు సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. కేసులు పెండింగ్‌లో లేకుండా నాణ్యమైన దర్యాప్తును పారదర్శకంగా చేపట్టాలని అన్నారు. మావోయిస్టుల కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సంఘ విద్రోహ శక్తులకు సాయం చేసే వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఓఎస్డీ శోభన్‌కుమార్‌, ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్‌చంద్రపవార్‌, డీఎస్పీలు సంపత్‌రావు, కిషన్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 

ఆయుధపూజలో పాల్గొన్న ఎస్పీ దంపతులు 

దసరా పండుగ సందర్భంగా ములుగులో నిర్వహించిన ఆయుధ పూజలో ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ సతీ సమేతంగా పాల్గొన్నారు.