శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jayashankar - Oct 27, 2020 , 01:07:13

సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి

సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి

దసరా వేడుకల్లో జడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీరాకేశ్‌

కాటారం, అక్టోబర్‌26: సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావి తరాలకు వారసత్వంగా ఇవ్వాలని జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీరాకేశ్‌ అన్నారు. మండలకేంద్రంలోని గారెపల్లి పీహెచ్‌సీ ఆవరణలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన రావణాసురవధ కార్యక్రమానికి జడ్పీ చైర్‌పర్సన్‌ ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్‌ తోట రాధమ్మ, ఎంపీటీసీ తోట జనార్ధన్‌లతో కలిసి నిప్పంటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చెడుపై మంచి ఎపుడూ విజయం సాధిస్తుందని, చెడుపై మంచి విజయం సాధించిన గుర్తుగానే ప్రతీ ఏటా విజయదశమి వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. మనం జరుపుకునే ప్రతీ పండుగలో పరమార్ధం దాగి ఉందన్నారు. పండుగలు మనిషి నడవడిక ఎలా ఉండాలో చెప్తాయన్నారు. మండలకేంద్రంతో పాటు గ్రామాల్లో దసరా వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. సాయంత్రం పాలపిట్ట దర్శనం చేసుకొని జమ్మి వృక్షాల వద్దకు వెళ్లి ఆకును తెచ్చి ఆకును తెచ్చి బంధువులకు, స్నేహితులకు చేతుల్లో పెట్టి దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాటారంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావణాసురవధలో సర్పంచ్‌ తోట రాధమ్మ, ఉపసర్పంచ్‌ నాయిని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.