శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jayashankar - Oct 25, 2020 , 02:14:51

తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ

 తెలంగాణ  సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ

చిట్యాల/టేకుమట్ల, అక్టోబర్‌24: తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ నిదర్శనమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ముచినిపర్తి గ్రామంలో సర్పంచ్‌ నందికొండ కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఆడపడుచులు ఎంతో వైభవంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ ఇంటింటా సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదావీరారెడ్డి, జడ్పీటీసీ సాగర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ క్రాంతికుమార్‌, ఏరుకొండ గణపతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే గండ్ర ఆవిష్కరించారు. విగ్రహదాత తోట రాయమల్లును ఆయన సన్మానించారు. రామకృష్ణపూర్‌(టీ)లోని బతుకమ్మ వేడకలకు హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రాఘవపూర్‌లోని పల్లెప్రకృతి వనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లారెడ్డి, జడ్పీటీసీ తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంపత్‌గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మహేందర్‌గౌడ్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.