గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 25, 2020 , 02:14:57

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముగిసిన వేడుకలు

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముగిసిన వేడుకలు

భూపాలపల్లి టౌన్‌, అక్టోబర్‌ 24: ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దం పతులు చేస్తున్న పూజలు శనివారంతో ముగిశాయి. తొమ్మిది రోజులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి  జ్యోతి ప్రత్యే క పూజలు నిర్వహించారు.  అమ్మవారికి నవ కషాభిషేకం, సప్తశది పారాయణం, లలిత త్రిపుర సుందరి అష్టోత్తర అవనం, ఆరాధన కార్యక్రమాలు, హోమం, చంఢీయాగం తదితర కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.  పూజ లో జడ్పీవైస్‌ చైర్మన్‌ కళ్లెపు శోభా రఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి, భూపాలపల్లి, ఘణపురం పీఏసీఎస్‌ చైర్మన్‌లు మేకల సంపత్‌ యాదవ్‌, పూర్ణచందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, జడ్పీటీసీలు జోరుక సదయ్య, గొర్రె సాగర్‌, టీఆర్‌ఎస్‌ అర్భన్‌, మండల అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, రవీందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు బుర్ర రమేశ్‌ , కౌన్సిలర్లు, పార్టీ నేతలు హాజరయ్యారు. 

బతుకమ్మ వేడుకలు..

భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే గండ్ర వెంకటి రమణారెడ్డి సతీమణి వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.