గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 25, 2020 , 02:14:57

జీపీ సిబ్బంది సేవలు మరువలేనివి

జీపీ సిబ్బంది సేవలు మరువలేనివి

  • జడ్పీటీసీ సునీత 
  • సిబ్బందికి దుస్తులు, స్వీట్లు పంపిణీ

చిన్నగూడూరు అక్టోబర్‌24: ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని జడ్పీటీసీ మూల సునీతామురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో జీపీ సిబ్బందికి సర్పంచ్‌లు, కార్యదర్శులు స్వీట్టు పంపిణీ చేసి, అభినందనలు తెలిపారు. గుండంరాజుపల్లిలో జడ్పీటీసీ సొంత డబ్బులతో సిబ్బందికి కొత్త బట్టలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు రాధా, సలీమా, పూలమ్మ, మల్లయ్య, కార్యదర్శులు సోమ న్న, టీఆర్‌ఎస్‌ నాయకులు యాకన్న, కృష్ణ ఉన్నారు.

 జీపీ సిబ్బందికి సన్మానం   

మరిపెడ: సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం మండలంలోని పలు గ్రామాల్లో జీపీ సిబ్బందిని ఆయా గ్రామాల సర్పంచ్‌లు శాలువాలతో ఘనంగా సన్మానించి, స్వీట్లను పంపిణీ చేశారు. జీపీ సిబ్బంది వేతనాలు పెరిగాక మొట్టమొదటి దసరా పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని సర్పంచ్‌లు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆనేపురం సర్పంచ్‌ దామెర్ల వీరన్న పంచాయతీ సిబ్బందికి ప్రత్యేకంగా సన్మానం చేసి సీట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ వీ శ్రీనివాస్‌, వార్డు సభ్యులు ఎల్లేశ్‌ తదితరులున్నారు. 

దంతాలపల్లి:  మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు జీపీ ఉద్యోగస్తులకు స్వీట్లను పంపిణీ చేసి అభినందించారు. గ్రామ అభివృద్ధి, కొవిడ్‌-19 నివారణలో జీపీ సిబ్బం ది పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. సర్పంచ్‌లు నూకల హిమబింధు, కృష్ణ, నాగిరెడ్డి శైలజ పాల్గొన్నారు. 

నర్సింహులపేట: గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది సేవలు ఎంతో విలువైనవని, అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని సర్పంచ్‌ జొన్నగడ్డ యాదలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు స్వీట్స్‌, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.

తొర్రూరు: అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు దసరా పం డుగ సందర్భంగా జీపీ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసినట్లు చెర్లపాలెం సర్పంచ్‌ సట్ల నాగలక్ష్మి చేశారు.  ఎంపీటీసీ కిరణ్‌, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, వార్డు సభ్యు లు రవీందర్‌రెడ్డి, య మున, శారద, రామచంద్రం, భూలక్ష్మి తదితరులున్నారు. 

పెద్దవంగర :  పంచాయతీ సిబ్బంది సేవలు ఎంతో విలువైనవని సర్పంచ్‌ లక్ష్మి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్య శర్మ అన్నారు.  మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు స్వీట్స్‌, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.  ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌ రాము, నాయకులు లింగమూర్తి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.

ఏటూరునాగారం : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌చుట్టూ  ప్రహరీ నిర్మాణంలో పని చేసిన తాపీ మేస్త్రీలకు పోలీసులు దుస్తులు, స్వీట్లు దసరా పండుగ సందర్భంగా అందజేశారు. ఇటీవల పోలీసుస్టేషన్‌, క్వార్టర్స్‌ చుట్టూ ప్రహ రీ నిర్మాణం చేశారు. కాగా, వారికి ట్రైనీ ఏఎస్పీ గౌశం ఆలం దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కిరణ్‌కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. 

మహబూబాబాద్‌ రూరల్‌ : సద్దుల బతుకమ్మ సందర్భంగా ము న్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికులకు  చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. కౌన్సిలర్లు  వెంక న్న, చిట్యాల జనార్దన్‌,వేణు,రాజు, జగన్‌ తదితరులున్నారు.