గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 24, 2020 , 02:55:08

పండుగలను సంతోషంగా జరుపుకోవాలి

పండుగలను సంతోషంగా జరుపుకోవాలి

భూపాలపల్లి/ ములుగు/ కృష్ణకాలనీ/ ఏటూరు నాగారం/గోవిందరావుపేట/వాజేడు/కాటారం/మల్హర్‌/ మొగుళ్లపల్లి, అక్టోబర్‌ 23: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను సంతోషంగా జరుపుకోవాలని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ సూచించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా క్లేంద్రంలోని రెడ్డికాలనీలో ప్రతిష్ఠించిన దర్గామాతను శుక్రవారం ఎంపీ దర్శించుకున్నారు. . ముందుగా జిల్లా ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భూపాలపల్లి టీఆర్‌ఎస్‌ భూపాలపల్లి అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి నివాసంలో అల్పాహారం తీసుకొని సేదతీరారు. ఎంపీ వెంట  కౌన్సిలర్లు నాయకులు ఉన్నారు.  భూపాలపల్లి సింగరేణి ఏరియా కేటీకే 1వ గని దుర్గామాత ఆలయంలో గనిమేనేజర్లు పూజలు నిర్వహించారు. కేటీకే 1వ, కేటీకే ఓసీపీ-2 గని మేనేజర్లు వెంకటేశ్వర్‌రావు, కృష్ణప్రసాద్‌ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ నేతలు పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో రామాలయం పూజారి శ్రీనివాసాచార్యులు పూజలు నిర్వహించి మహాలక్ష్మీ అవతార విశిష్టతను భక్తులకు తెలియజేశారు.  ఏటూరునాగారంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద హోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయ నిర్మాణ స్థలంలో చేపట్టిన మహా అన్నదాన కార్యక్రమంలో సీఐ కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌ రవీందర్‌, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. గోవిందరావుపేటలో పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌ చల్వాయి రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాఅన్నదానాన్ని ప్రారంభించారు. వాజేడు మండలం ధర్మవరంలో హోమం నిర్వహించారు. కాటారంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చండీహోమం నిర్వహించారు. మల్హర్‌ మండలం వల్లెంకుంటలోని త్రిశక్తి పీఠం ఆలయంలో అన్నపూర్ణ దేవిగా అమ్మవారిని అలంకరించారు. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తిశ్వర స్వామి ఆలయంలో పార్వతి, మహా సరస్వతీ అమ్మవారి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. మొగుళ్లపల్లిలో దుర్గామాతను  మహాలక్ష్మిగా అలంకరించారు. హోమం, అన్నదానం చేశారు.