గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 24, 2020 , 02:57:26

‘సద్దుల బతుకమ్మ’కు సర్వం సిద్ధం

‘సద్దుల బతుకమ్మ’కు సర్వం సిద్ధం

కృష్ణకాలనీ/ములుగు/ ఏటూరు      నాగారం, అక్టోబర్‌23: బతుకమ్మ వేడుకల్లో భాగంగా చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు శనివారం వైభవంగా నిర్వహించేందుకు జిల్లా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహిళలు సిద్ధమయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌, గణేశ్‌ చౌక్‌ల వద్ద పూలు, రంగులు కొనుగోలు చేశారు. మహిళలు బతుకమ్మలు ఆడుకునేందుకు  అధికారులు, ప్రజాప్రతినిదులు జిల్లా కేంద్రంలోని వారాంతపు సంత ప్రాంగణం, అంబేద్కర్‌ క్రీడా మైదానం, రెడ్డికాలనీ, జవహర్‌నగర్‌ కాలనీలో, సుభాష్‌ కాలనీ రామాలయం ప్రాంగణాల్లో మైదానాలను చదును చేయించి వీధి లైట్లను ఏర్పాటు చేశారు. ఏటూర్‌నాగారం, మంగపేట, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలు, పెద్దపల్లి జిల్లా మంథని, గోదావరి ఖని  నుంచి పూల వ్యాపారులు వాహనాల్లో పూలు తీసుకొచ్చి విక్రయించారు. ములుగు జిల్లా కేంద్రంలో మహిళలు, యువతులు చౌరస్తాకు పూల కొనుగోలు చేశారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం నిర్వహించనున్న సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రామాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ సప్పిడి రాము  తెలిపారు. ఆకర్షనీయమైన బతుకమ్మలకు పదమూడు బహుమతులను అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. రూ. 5వేల విలువ చేసే మూడు బహుమతులతో పాటు 10 కన్సోలేషన్‌ బహుమతులను అందజేస్తామన్నారు. శివాలయం, బొడ్రాయి, బస్టాండ్‌తోపాటు పలు చోట్ల సద్దుల బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు.