బుధవారం 25 నవంబర్ 2020
Jayashankar - Oct 23, 2020 , 02:03:21

కుమ్రంభీం ఆశయాలను కొనసాగించాలి

కుమ్రంభీం ఆశయాలను కొనసాగించాలి

ఏటూరునాగారం, అక్టోబర్‌ 22 : మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో కుమ్రంభీం జయంతి వేడుకలను ఆదివాసీ ఉద్యోగుల సంఘం, తుడుందెబ్బ  ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా డీటీడీవో ఎర్రయ్య, ఐటీడీఏ ఏవో దామోదర్‌స్వామి, మేనేజర్‌ లాల్‌నాయక్‌, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొదెం కృష్ణ ప్రసాద్‌ భీం విగ్రహానికి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీం ఆశయాలకు అనుగుణంగా నడువాలని సూచించారు. ఆయన స్ఫూర్తితో ఆదివాసీ యువత ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కబ్బాక శ్రావణ్‌కుమార్‌, ఐటీడీఏ ఉద్యోగుల సంఘం నాయకులు వెంకన్న, పెనక కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

వాజేడు మండలంలో..

వాజేడు : మండలకేంద్రంలోని హనుమాన్‌ సెంట ర్‌ వద్ద గురువారం కుమ్రంభీం జయంతి వేడుకలను ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. తల్లడి పాపారావు ఆధ్వర్యంలో ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దాత నూగూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోదెబోయిన బుచ్చయ్య భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల శారద, జడ్పీటీసీ తల్లడి పుష్పలత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గొంది రమణారావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూసం నరేశ్‌, ఎంపీటీసీలు బీరబోయిన పార్వతి, యాలం చిట్టిబాబు, సర్పంచులు బుల్లేశ్వర్‌రావు, జెజ్జరి మేనక, యాలం సరస్వతి, ఆదివాసీ సంఘం నాయకులు, ఉద్యోగులు దబ్బకట్ల లక్ష్మయ్య, ఎట్టి బాబూరావు, పూసం నాగేశ్వర్‌రావు, బోదెబోయిన శ్రీనివాసరావు, నల్లెబోయిన సర్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపురం(నూ) మండలంలో..

వెంకటాపురం(నూగూరు) : మండలంలో కుమ్రంభీం జయంతిని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు మండల కేంద్రంలోని భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాయం రమణ, సర్పంచ్‌ చిడెం యామిలి, ఉప సర్పంచ్‌ దేవరకొండ ధనలక్ష్మి, ఆదివాసీ సంఘాల నాయకులు శంకర్‌, రాంచందర్‌, పూనెం సాయి, వాసం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.