బుధవారం 25 నవంబర్ 2020
Jayashankar - Oct 23, 2020 , 02:03:19

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

బచ్చన్నపేట, ఆక్టోబర్‌ 22 : గోదావరి నీటిని పొలాలు, చెరువులకు మళ్లించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా తానే ప్రాజెక్టుల నిర్మాణాలకు రూపకల్పన చేసి ప్రపంచం మెచ్చుకునేలా ముందుకు సాగుతున్నారన్నారు. గురువారం బచ్చన్నపేటకు చెందిన కేబీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, బీజేపీ నాయకుడు కొండి వెంకట్‌రెడ్డి సహా కాంగ్రెస్‌, టీడీపీ నుంచి సుమారు 300 మంది ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. స్థానిక శ్రీనివాస ఫంక్షన్‌హాల్‌లో మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ..  అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించడం లో కేసీఆర్‌కు సాటి ఎవరూ రారన్నారు. ఎవరూ చేయని పనులను చేసి చూపించిన సీఎం గురించి తరతరాలు చెప్పుకుంటారన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కొండి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస ఫంక్షన్‌హాల్‌ యజమాని మట్టి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుడు గర్నేపల్లి అరవింద్‌, టీడీపీ నియోజకవర్గ నాయకుడు తెల్ల సందీప్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు లక్కిరెడ్డి చంద్రారెడ్డి, బొల్లపల్లి మల్లయ్య, మహేందర్‌ తదితరులు ఉన్నారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల పేర ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను విస్తరిస్తానన్నారు. అనంతరం వెంకట్‌రెడ్డికి ఎమ్మెల్యే స్వీట్లు తినిపించి శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు మాజీ హోంమంత్రి, స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి మృతికి రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పూర్ణచందర్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు సతీశ్‌రెడ్డి,  జనగామ పీఏసీఎస్‌  చైర్మన్‌ మహేందర్‌రెడ్డి,  సర్పంచ్‌, ఎంపీటీసీలు మల్లారెడ్డి, బాల్‌రెడ్డి, మధుప్రసాద్‌, వేణు, కౌన్సిలర్‌ అరవింద్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ సిద్ధులు, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు షబ్బీర్‌, నాయకులు గిరబోయిన అంజ య్య, బావండ్ల కృష్ణంరాజు, సిద్ధి రాంరెడ్డి,  గుర్రపు బాలరాజు, అజీం, ఐలయ్య, నర్సిరెడ్డి, ఆజాం, వేణు, మహేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, బాలసిద్ధులు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.