గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 22, 2020 , 02:55:10

24 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

24 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

కేటీదొడ్డి : రేషన్‌ బియాన్ని  అక్రమంగా  వాహనంలో తరలిస్తుండగా పట్టుబడిన సంఘటన మైలగడ్డ స్టేజీ వద్ద బుధవారం చోటు చేసుకున్నది. ఎస్సై బాలవెంకటరమణ కథనం ప్రకారం మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన తెలుగు రవి కొన్ని రోజులగా చుట్టు ప్రక్కల గ్రామాల్లో రేషన్‌ బియ్యాన్ని  సేకరించి బోలెరో వాహనంలో రాయిచూర్‌కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో మైలగడ్డ స్టేజీ వద్ద  డీటీ గణపతి రావు, పోలీసులు అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేశారు. తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న 24 క్వింటాళ్ల రేషన్‌ బియ్యని స్వాధీనం చేసుకున్నారు. డీటీ గణపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.