గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 22, 2020 , 01:35:10

‘నాటు’ దందాకు నయాదారులు

‘నాటు’ దందాకు నయాదారులు

  • కార్లలో బెల్లం, స్ఫటిక తరలింపు
  • నేరుగా గుడుంబా తయారీదారులకు చేరవేత
  • వ్యాపారుల కొత్త పంథా
  • వాహనాల తనిఖీల్లో వెలుగులోకి
  • పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారుల విస్మయం

వరంగల్‌రూరల్‌, నమస్తేతెలంగాణ: గుడుంబా తయారీ కోసం బెల్లం రవాణా చేసే వ్యాపారులు కొత్తదారులు ఎంచు కున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కార్ల ద్వారా నేరుగా గుడుంబా తయారీదారులకు పంపుతున్నారు. ఇటీవలి కా లంగా జరిగిన వరుస సంఘటనలతో ఇది వెలుగులోకి వచ్చింది. వాహనాల తనిఖీలో కార్లలో బెల్లం నిల్వలు ఉండ డం చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వ్యాపారు లు ఇన్నాళ్లు మహరాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని కామారెడ్డి, హైదరాబాద్‌ నుంచి బెల్లా న్ని లారీలు, వ్యాన్ల ద్వారా తెచ్చి తమ గోదాముల్లో నిల్వ చే శారు. ఆ తర్వాత ఆటోల ద్వారా బెల్లం, స్ఫటికను నేరుగా గుడుంబా తయారీదారుల ఇండ్లు, స్థావరాలకు పంపారు. 

ఇటీవల ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని అధి కారులను ఆదేశించడంతో పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులు బెల్లం, స్ఫటికను సరఫరా చేసే వ్యక్తులపై గట్టి నిఘా పెట్టారు. వాటికి సంబంధించిన లారీలు, వ్యాన్లను పట్టుకుని కేసులు నమోదు చేసి సీజ్‌ చేశారు. గోదాములపైనా దాడులు జరిపి బెల్లం, స్ఫటిక నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో లారీలు, వ్యాన్ల ద్వారా బెల్లం రవాణాకు గుడ్‌బై చెప్పి ఆటో లను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇది తెలిసి అధికా రులు ఆటోలను ఆపి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తు న్నారు. వాటినీ సీజ్‌ చేస్తుండడంతో ఓనర్లు బెల్లం రవాణాకు దూరంగా ఉంటున్నారు. చివరకు తాము ఆటోలను కొని రవాణా చేసినా అధికారులు పట్టుకుంటుండడంతో వ్యాపారు లు కొత్త రూట్లను ఎంచుకున్నారు.

అధికారులు అనుమానించకుండా..

పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు అనుమానించకుండా వ్యాపారులు కార్ల ద్వారా బెల్లం, స్పటికను రవాణా చేయడం మొదలు పెట్టారు. నెక్కొండ మండల కేంద్రంలో సోమవా రం స్థానిక పోలీసులు బెల్లం రవాణా అవుతున్న ఓ కారు(ఇం డికా)ను పట్టుకున్నారు. నాలుగు క్వింటాళ్ల బెల్లాన్ని, కారును స్వాధీనం చేసుకున్నారు. బెల్లం రవాణా చేస్తున్న చెన్నారావు పేట మండలంలోని ఒగ్గుతండాకు చెందిన ముగ్గురు వ్యక్తు లపై కేసు నమోదు చేశారు. ఐదు రోజుల క్రితం ఇదే నెక్కొండ మండలంలో సూరిపల్లి గ్రామం వద్ద బెల్లం, స్పటికతో ఓ కారు(బొలెరో)ను అధికారులు పట్టుకుని క్వింటాల్‌ బెల్లం, 3,400 కిలోల స్ఫటికను స్వాధీన పరుచుకున్నారు. నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన కారులో ఆంధ్రప్రదే శ్‌లోని ఒంగోలు నుంచి వీటిని తెస్తున్నట్లు విచారణలో తేలిం ది.

నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామం వద్ద కొద్ది రో జుల క్రితం ఎక్సైజ్‌శాఖ అధికారులు ఓ బొలేరోను పట్టుకుని. అందులో 9 క్వింటాళ్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. మ హబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రా మానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ బెల్లం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నెల ఒకటిన నర్సంపేటలోని పాకాల రోడ్డు లో పోలీసులు ఓ కారు(ఇండికా)ను పట్టుకుని 133 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట పట్టణానికి చెంది న ఇద్దరు తమ కారులో ఈ బెల్లం గుడుంబా తయారీ కోసం రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు. 

కొద్ది రోజుల క్రితం వర్ధన్న పేట మండలంలోని కట్య్రాల గ్రామం వద్ద బెల్లం రవాణా చేస్తున్న ఓ కారు (ఇండికా)ను పట్టుకున్నారు. మహబూబా బాద్‌ జిల్లాలోని తొర్రూరు మండలానికి చెందిన ఓ వ్యాపారి తన కారులో ఈ బెల్లం గుడుంబా తయారీదారులకు రవాణా చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. నాలుగు రోజుల క్రితం వరంగల్‌ నగరంలో కూడా బెల్లం రవాణా చేస్తున్న ఓ కారు ను పట్టుకుని సీజ్‌ చేశారు. ఆటోలను కచ్చితంగా ఆపి తనిఖీ లు చేస్తున్న తాము కార్లను ఆపమని, చెక్‌ చేయమనే ఆలోచ నతో బెల్లం వ్యాపారులు కొత్తగా తమ దందాలో కార్లను ఉప యోగిస్తున్నారని పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులు భావిస్తు న్నారు. బెల్లం రవాణా చేస్తున్న కార్లను పట్టుకోవడంపై దృష్టి పెట్టారు. ప్రధానంగా గుడుంబా తయారీ కోసం బెల్లం రవా ణా జరిగే రూట్లలో వాహనాల తనిఖీకి ప్రాధాన్యం ఇస్తున్నా రు. కార్లను ఆపి తనిఖీ జరిపిన తర్వాతే వదిలిపెడుతున్నారు.