ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Oct 22, 2020 , 01:35:34

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

  • ఎంపీపీ పంతకాని సమ్మయ్య 
  • కాటారంలో మండల సర్వసభ్య సమావేశం

కాటారం : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ పంతకాని సమ్మయ్య అన్నారు. బుధవారం ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో శాఖల వారీగా అభివృద్ధి, ప్రజాసమస్యలపై సమీక్ష నిర్వహించారు. బెల్ట్‌ షాపుల నియంత్రణ, పీహెచ్‌సీలో గైనకాలజిస్ట్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేలా తీర్మానాలతో పాటు మిషన్‌ భగీరథ, బతుకమ్మ చీరెల పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలుపై సభలో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పలు శాఖల అధికారులు తమ వైఖరి మార్చుకుని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శంకర్‌, ఎంపీవో మల్లికార్జున్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ చీర్ల తిరుమల, సర్పంచులు తోట రాధమ్మ, అంతర్గాం రాజమౌళి, తెప్పల దేవేందర్‌రెడ్డి, బాసాని రఘువీర్‌, జనగామ రమాదేవి, దోమ రాహుల్‌, అంగజాల అశోక్‌, నిట్టూరి శేఖర్‌, ఫిరోజుద్దీన్‌, ఎంపీటీసీలు తోట జనార్దన్‌, మహేశ్‌, రవీందర్‌రావు, జాడి మహేశ్వరి, ఉడుముల విజయారెడ్డి, బోడ మమత, రూప, బక్కమ్మ, రవి, కో-ఆప్షన్‌ సభ్యుడు అజీజ్‌ఖాన్‌, ఏపీవో వెంకన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo