గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Oct 21, 2020 , 01:56:39

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

  • కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

మహబూబాబాద్‌ రూరల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పీహెచ్‌సీల డాక్టర్లతో కొవిడ్‌పై సమీక్షించారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న గంధపల్లి, కొత్తపేట, డోర్నకల్‌ మండలంలోని గొల్లగూడెంపై ప్రత్యేక  దృష్టి పెట్టాలన్నారు. మరిపెడ ట్రైబల్‌ హాస్టల్‌లో 21 మందికి పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్లు తెలుపగా, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే హాస్టల్‌లో చేర్చుకోవాలన్నారు. ఒక్కో పీహెచ్‌సీలో రోజూ 100 నుంచి 150 పరీక్షలు  చేయాలని, పాజిటివ్‌ ఎక్కువగా ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టాలని సూచించారు. తొర్రూరు, దంతాలపల్లి, నెల్లికుదురు, మరిపెడ మండలాల్లో దృష్టి సారించాలని డాక్టర్లకు సూచించారు. తీగలవేణి, బలపాల, మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కాన్పుల ప్రగతిలో వెనుకబడి ఉన్నాయని, లక్ష్యాన్ని సాధించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరాం, డాక్టర్లు రాజేశ్‌, అంబరీష పాల్గొన్నారు. 

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి..

జిల్లాను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్య లు తీసుకున్నట్లు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఎఫ్‌వో రవికిరణ్‌ కలిసి టూరిజం అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా ను టూరిజం హబ్‌ తీర్చిదిద్దాలన్నారు. బయ్యారం పెద్ద చెరు వు, కొత్తగూడ మండలంలో పాకాల చెరువును అభివృద్ధి చేస్తే నిరుద్యోగ యువత ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఇనుగుర్తి, డోర్నకల్‌, గార్ల, బయ్యారం, గంగారం, గూడూరు మం డలాల్లో టూరిజం అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీ వో కొమురయ్య, డీఈవో సోమశేఖర్‌ శర్మ, నీటి పారుదల శాఖ ఈఈ రాధాకృష్ణ పాల్గొన్నారు. 

ఏరియా దవాఖానలో తనిఖీలు

మహబూబాబాద్‌ టౌన్‌: డోర్‌మ్యాట్స్‌ లేకపోవడం కూడా పారిశుధ్య లోపమేనని, వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఏరియా దవాఖానలో తనిఖీలు చేపట్టారు. ఎక్స్‌రే, రక్త పరీక్షలు, శిశు సంరక్షణ విభాగం, ఐసీయూ, రిజిస్టర్లు పరిశీలించారు. రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట సూపరింటెండెంట్‌ భీమ్‌ సాగర్‌, వైద్యులు రమేశ్‌, అంజన్‌కుమార్‌, రసజ్ఞ, ఎస్‌యూవో శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo