ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Oct 21, 2020 , 01:56:44

రేపు నిట్‌ 18వ స్నాతకోత్సవం

రేపు నిట్‌ 18వ స్నాతకోత్సవం

  • తొలిసారి వర్చువల్‌ విధానంలో నిర్వహణ
  • 1500 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పట్టాలు
  • యూట్యూబ్‌ లింక్‌ ద్వారా వీక్షణకు ఏర్పాట్లు

 నిట్‌క్యాంపస్‌, అక్టోబర్‌20: నిట్‌ వరంగల్‌ 18 వ స్నాతకోత్సవానికి చకచకా ఏర్పాట్లు సాగుతు న్నాయి. ఈ నెల 22వ తేదీన నిర్వహించే ఈ ఉత్స వానికి విద్యార్థులెవరూ హాజరు కావడం లేదు. కానీ 1500 మందికి డిగ్రీ పట్టాలు అందుతాయి. ఇదంతా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అయి న వర్చువల్‌ విధానం ద్వారా సాంకేతిక విద్యార్థు లకు పట్టాలు అందనున్నాయి. మోషన్‌ క్యాప్చర్‌, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ విధానంతో విద్యార్థుల మోషన్‌ పిక్చర్‌ను తయారు చేస్తున్నారు. ఈ విధా నంతో విద్యార్థుల రూపంలో ఉన్న యానిమేటెడ్‌ పిక్చర్‌ను పోలిన ఈ-అవతార్‌తో తమ వంతు రాగానే అతిథుల నుంచి పట్టా స్వీకరిస్తారు. ఇందు లో విద్యార్థుల ముఖాలను ఆన్‌లైన్‌ మోషన్‌ క్యాప్చర్‌ చేసినట్లు నిట్‌ అధికారులు తెలిపారు. ఏ ధీరమ్స్‌ స్టూడియో వారు ఈ టెక్నాలజీతో స్నాత కోత్సవ నిర్వహణ చేపడుతున్నారు. ఈ ఉత్సవా న్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఇచ్చిన యూట్యూబ్‌ లింక్‌ ద్వారా గానీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా గానీ వీక్షించవచ్చని తెలిపారు.

కేంద్ర మంత్రి చేతుల మీదుగా..

  కేంద్ర విద్యాశాఖా మంత్రి పోక్రియాల్‌ నిశాం క్‌, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నా రాయణమూర్తి ఇంట్లో నుంచి వారి ఈ-అవతార్‌ మోషన్‌ క్యాప్చర్‌ ద్వా రా పట్టాలు అందజేస్తారు. నిట్‌ డైరె క్టర్‌ ఎన్వీ రమణారావు అధ్యక్షతన జరుగుతున్న ఈ స్నాతకోత్సవాన్ని కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నిర్వ హిస్తున్నారు. 1500 మంది బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలు స్వీకరిస్తారు.

VIDEOS

logo