ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

- ఎమ్మెల్యే గండ్ర ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 20 : త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికలో ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెం కటరమణారెడ్డి కోరారు. మంగళవారం భూపాలపల్లిలోని క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే పట్టణంలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కళాశాలల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క లెక్చరర్‌తో పాటు వారి మిత్రులైన గ్రాడ్యుయేట్లు ఎన్నికలో తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని కోరారు. 2017లోగా ఉత్తీర్ణత సాధించిన గ్రాడ్యుయేట్లను గుర్తించి వారి ఓటు హక్కును ఆన్లైన్లో నమోదు చేయించాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, సీనియర్ నాయకుడు బుర్ర రమేశ్, ఆయా జూనియర్, డిగ్రీ కళాశాలల పిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు, లెక్చరర్లు పాల్గొన్నారు.
ఇన్చార్జిలతో టెలీకాన్ఫరెన్స్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గం డ్ర నియోజకవర్గంలోని ఆయా మండలా ల ఇన్చార్జిలను కోరారు. మంగళవారం సాయంత్రం పార్టీ ఇన్చార్జిలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల వారీ గా పట్టభద్రులను గుర్తించి ఓటు నమో దు చేయించాలని, టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- రైల్వేలో ఉద్యోగాలంటూ మస్కా
- పీడీయాక్టు పెట్టినా మారలేదు..
- అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..
- జీవితానికి భారంగా ఊబకాయం
- ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
- పెండ్లి గిఫ్ట్ అంటూ.. 11.75లక్షలు టోకరా
- నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు
- జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నిక
- విక్టోరియాను ఉత్తమ బోధనా కేంద్రంగా మారుస్తాం
- రిమ్జిమ్ రిమ్జిమ్.. హైదరాబాద్