మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Oct 21, 2020 , 01:57:03

భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌కు ఇంటర్నేషనల్‌ అవార్డు

భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌కు ఇంటర్నేషనల్‌ అవార్డు

  • అందజేసిన లయన్స్‌  క్లబ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి కలెక్టరేట్‌: జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌కు లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ అ వార్డును అందజేసింది. కలెక్టర్‌ తన విధుల్లో భాగంగా పేద ప్రజలకు చేస్తున్న సేవలను వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకుని లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు జంగ్‌యుల్‌ చోయ్‌ ఆయన ను అభినందించి, సేవా పత్రంతోపాటు పిన్నును పంపించారు. ఈ మేరకు వరంగల్‌ ఉమ్మడి జిల్లా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి మంగళవా రం కలెక్టర్‌ కార్యాలయంలో అబ్దుల్‌ అజీమ్‌ను కలిసి సేవా పత్రాన్ని అందించి, లయన్స్‌ క్లబ్‌ ప్రెసి డెంట్‌ పిన్నును ఆయన జేబుకు అమర్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిస్వార్థ సేవ ఎప్పటికీ గుర్తింపునిస్తుందని అన్నారు. తనకు ఈ అ వార్డు రావడం చాలా సంతోషకరమని పేర్కొ న్నారు. ఈ అవార్డు మరింత బాధ్యత పెం చిందని, ప్రజల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అధికారు లందరికీ లభించిన గౌరవంగా భావిస్తు న్నానని తెలిపారు.

VIDEOS

logo