ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Oct 19, 2020 , 04:55:11

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి : గండ్ర

పట్టభద్రులు  ఓటరుగా నమోదు చేసుకోవాలి : గండ్ర

భూపాలపల్లి టౌన్‌ : పట్టభద్రులు ఓటరుగా పేరు నమో దు చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, పార్టీ సీనియర్‌ నాయకుడు బుర్ర రమేశ్‌, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


logo