ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Oct 19, 2020 , 04:35:55

‘ధరణి’ పై అవగాహన కలిగి ఉండాలి

‘ధరణి’ పై అవగాహన కలిగి ఉండాలి

భూపాలపల్లి కలెక్టరేట్‌, అక్టోబర్‌ 18: ధరణి పోర్టల్‌పై తహసీల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉం డాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. ఆదివారం కలెక్టర్‌ కార్యాలయంలో తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు  పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్‌పై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో కలెక్టర్‌ దగ్గరుండీ తహసీల్దార్లతో డమ్మీ రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీన సీఎం కేసీఆర్‌ ధరణి ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో అన్ని మండలాల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. అమ్మకాలు, కొనుగోలు, మ్యుటేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత తేదీ, సమయం కేటాయిస్తూ తిరిగి ఆర్జీ దారునికి తెలియ జేయాలన్నారు. ఆన్‌ లైన్‌లో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ఆపరేటర్ల మీద ఆధారపడకుండా తహసీల్దార్లు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్లలో తప్పులు జరుగకుండా రిజిస్ట్రేషన్‌ ప్రొసీజర్‌ పాటించాలన్నారు. శిక్షణలో ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లు పాల్గొన్నారు.


logo