సోమవారం 26 అక్టోబర్ 2020
Jayashankar - Oct 19, 2020 , 04:35:55

ఘనంగా అమ్మవారికి పూజలు

ఘనంగా అమ్మవారికి పూజలు

భూపాలపల్లిటౌన్‌, అక్టోబర్‌ 18 : ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు చేస్తున్న లక్ష్మీపూజ ఆదివారం రెండో రోజుకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కళ్లెపు శోభా రఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి, భూపాలపల్లి, ఘణపురం పీఏసీఎస్‌ చైర్మన్లు మేకల సంపత్‌ యాదవ్‌, పూర్ణచందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, జడ్పీటీసీలు జోరుక సదయ్య, గొర్రె సాగర్‌, టీఆర్‌ఎస్‌ అర్బన్‌, మండల అధ్యక్షులు క్యాతరాజు సాంబమూర్తి, మందల రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

త్రిపుర సుందరీ దేవిగా..

మల్హర్‌ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వల్లెంకుంటలోని త్రిశక్తి పీఠ దేవస్థానంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో విగ్రహ దాత కొర్లకుంట సర్పంచ్‌ ముక్కెర నవీన్‌, ఆలయ అర్చకులు గడ్డం సతీశ్‌ భవాని, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ములుగు : జిల్లా కేంద్రంలోని రామాలయంలో దుర్గాదేవి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అర్చకుడు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, బండారి మోహన్‌, బాషని రాయపరెడ్డి, వాసుదేవరెడ్డి, నరసింహారెడ్డి, మహేందర్‌, రాకేశ్‌, రమేశ్‌, కవిరాజు, ప్రశాంత్‌ పాల్గొన్నారు.  

ఏటూరునాగారం : దుర్గామాతా గాయత్రి దేవీ అవతారంలో దర్శనమిచ్చారు. శివాలయం, సాయిబాబా ఆలయం, క్రాస్‌ రోడ్డు, స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉత్సవాల్లో భక్తులు హాజరై పూజలో పాల్గొన్నారు.

కాటారం: మండలకేంద్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో దుర్గాదేవి మండపం వద్ద ఉత్సవాలు  నిర్వహిస్తున్నారు. ఆలయ పూజారి నాగరాజుశర్మ ఆధ్వర్యం లో వాసవీక్లబ్‌ గవర్నర్‌ కలికోట శ్రీనివాస్‌-కల్పన దంపతు లు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్‌, నాయకులు అనంతుల రమేశ్‌బాబు, మద్ది కమలమనోహర్‌, కముటాల రవీందర్‌, పవిత్రం శ్రీనివాస్‌, బీరెల్లి పావనీఅంజయ్య, సూర్యనారాయణ, సదానందం, శ్రీనివాస్‌, చంద్రమౌళి, రవి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  logo