గురువారం 29 అక్టోబర్ 2020
Jayashankar - Oct 19, 2020 , 04:35:57

‘కో ఆప్షన్‌ సభ్యులకు గౌరవం ఇవ్వాలి’

‘కో ఆప్షన్‌ సభ్యులకు గౌరవం ఇవ్వాలి’

భూపాలపల్లి కలెక్టరేట్‌, అక్టోబర్‌ 18: భార త రాజ్యాంగం కో ఆప్షన్‌ సభ్యులకు కల్పించిన హక్కులను అధికారులు, ప్రజాప్రతినిధులు గౌరవించాలని జిల్లా కో ఆప్షన్‌ ఫోరం అధ్యక్షుడు రాజ్‌ మహ్మద్‌ కోరారు. ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో  కో ఆప్షన్‌ జిల్లా ఫోరం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహిచారు. ఈ సమావేశానికి జిల్లా కో ఆప్షన్‌ ఫోరం అధ్యక్షుడు రాజ్‌ మహ్మద్‌ అధ్యక్షత వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం లో ప్రభుత్వం ద్వారా నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రొటోకాల్‌ ప్రకారం  కో ఆప్షన్‌ సభ్యులకు తప్పకుండా సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఫోరం ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అయూబ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ నజీర్‌ ఖాన్‌, ఫోరం సమాచార కన్వీనర్‌ మ హ్మద్‌ మసూద్‌ అలీ, కో ఆప్షన్‌ సభ్యులు మ హ్మద్‌ భాష, సయ్యద్‌ నిజాముద్దీన్‌, మహ్మద్‌ చోటేమియా, భూపాలపల్లి పట్టణ మైనార్టీ నాయకులు మహ్మద్‌ కరీం పాల్గొన్నారు.  


logo