గురువారం 22 అక్టోబర్ 2020
Jayashankar - Oct 19, 2020 , 04:35:58

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

భూపాలపల్లి టౌన్‌, అక్టోబర్‌ 18 : గణపురం మండలం మైలారం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దాసారపు రాధ (55) మృతి చెందిం ది. ఎస్సై రాజన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన దాసారపు రాధ తన కొడుకుతో ద్విచక్రవాహనంపై గణపురం క్రాస్‌ రోడ్‌ నుంచి ఇంటికి వెళ్తున్నారు. మైలారంలో ఫ్లై యాష్‌ లారీ ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టడంతో రాధకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంపై పరకాల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించి ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఆమెకు భర్త సాంబయ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. logo