శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jayashankar - Oct 18, 2020 , 04:21:08

హైమాస్ట్‌ లైట్ల ప్రారంభం

హైమాస్ట్‌ లైట్ల ప్రారంభం

భూపాలపల్లి టౌన్‌/చిట్యాల: భూపాలపల్లి  మండలంలోని కొంపెల్లి ఎస్సీ కాలనీ, గుడాడ్‌పల్లి, గొర్లవీడు గ్రామాల్లో ఐమాస్ట్‌ లైట్లను జడ్పీ వైస్‌ చైర్మన్‌ కళ్లెపు శోభ రఘుపతిరావు శనివారం ప్రారంభించారు. జడ్పీ నిధుల నుంచి మూడు గ్రామాల్లో ఒక్కో ఐమాస్‌ లైట్‌కు రూ.1.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పెద్దాపూర్‌, సుబ్బక్కపల్లి తదితర గ్రామ పంచాయతీల్లో హైమాస్ట్‌ లైట్లను జడ్పీ నిధుల నుండి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చిట్యాల మండలం జడల్‌పేట, లక్ష్మిపూర్‌తండా, కొత్తపేట గ్రామాల్లో శనివారం జడ్పీటీసీ గొర్రె సాగర్‌ సెంట్రల్‌ లైట్లను ఆయా గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, సర్పంచులు కామిడి రత్నాకర్‌రెడ్డి, గజ్జిరవి, జవహర్‌లాల్‌ నాయక్‌, అజ్మీరా రాజ్‌నాయక్‌, దొడ్డె శంకర్‌ పాల్గొన్నారు.