శుక్రవారం 23 అక్టోబర్ 2020
Jayashankar - Oct 17, 2020 , 02:39:41

విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

భూపాలపల్లి: విద్యార్థులకు అర్థమయ్యేలా ఆన్‌లైన్‌ పాఠాలు బోధించాలని సింగరేణి పాఠశాల కరస్పాండెట్‌, భూపాలపల్లి ఏరియా డీజీఎం(పర్సనల్‌) మంచాల శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియా సింగరేణి పాఠశాల ఆవరణలో స్వచ్ఛత మహా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం( పర్సనల్‌) మాట్లాడుతూ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న క్రమంలో విద్యార్థుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్నారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ  పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం పర్యావరణ ప్రతిజ్ఞ చేసి, పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి, మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవితేజ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడారు. పచ్చదనంతో కూడిన స్వచ్ఛమైన వాతావరణం ఉంటే విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. ఈ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ పీవో రాజేశం. పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



logo