ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Oct 17, 2020 , 02:36:25

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు

ఘనంగా  ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు

సమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌:  ములుగు, భూపాలపల్లి  జిల్లాల్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు శుక్రవారం ప్రాంభమయ్యాయి. మహిళలు బతుకమ్మలను పేర్చడానికి తీరొక్క పూలను సేకరించారు. తెలంగాణ ఆడపడుచు అయిన బతుకమ్మను మహిళలు తమ ఇంట్లో సాంప్రదాయం ప్రకారం పూజించారు. సాయంత్రం బతుకమ్మ ఆడుకునే ప్రదేశాల్లోకి తీసుకువచ్చారు. మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

కాటారం మండలకేంద్రంలో జడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షిణి కుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. భూపాపలల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీ, యాదవకాలనీ, సింగరేణి టీ2, సాయిబాబా ఆలయ ప్రాంగణంలోని ఆడపడుచులందరూ కృష్ణకాలనీలోని అంబేద్కర్‌ క్రీడా మైదానంలో బతుకమ్మ ఆడారు. 30వ వార్డు కౌన్సిలర్‌ మాడ కమల ఆ వార్డు మహిళల కోసం రెడ్డికాలనీలోప్రత్యేకమైనా స్తలాన్ని చదును చేయించి, సభాప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ములుగులో ప్రస్తుతం కొవిడ్‌-19 నిబంధనల మేరకు అధికారుల సూచనతో మహిళలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. అన్ని మండలాల్లో సంబురాలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. 


logo