శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Oct 16, 2020 , 06:09:04

నలుగురిపై కేసు నమోదు

నలుగురిపై కేసు నమోదు

భూపాలపల్లి టౌన్‌ : సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ను బెదిరించిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి సీఐ వాసుదేవరావు తెలి పారు. సీఐ కథనం ప్రకారం.. మండలంలోని కొంపెల్లికి బుధవారం రైతు భవనాలకు సామగ్రిని తీసుకువచ్చిన ట్రాక్టర్‌ బురదలో దిగబడింది. ఈ క్రమంలో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ కాసగాని కవితాదేవేందర్‌, ఉప సర్పంచ్‌ విజేందర్‌ జీపీ ట్రాక్టర్‌చే దానిని బయటికి తీయించారు. కాగా, జీపీ ట్రాక్టర్‌ను ఎలా ఉపయోగిస్తారంటూ  కాగిత వీరన్న, కాగిత శ్రీపాల్‌, కాగి త రమణయ్య, శ్రీనివాస్‌ దాడికి యత్నించారని సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


logo