మంగళవారం 27 అక్టోబర్ 2020
Jayashankar - Oct 16, 2020 , 06:09:02

రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు

రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు

  • ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొనుగోళ్లలో ఉపయోగం
  • బ్యాంకుల ద్వారా మంజూరు
  • జిల్లాలో 254 దరఖాస్తులు..75 మందికి మంజూరు

భూపాలపల్లి టౌన్‌ :  జిల్లాలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు అమలు ప్రక్రియ మొదలైంది. 11 మండలాల్లో ఆయా బ్యాంకులకు 254 దరఖాస్తులు రాగా అందులో 75 మందికి మంజూరు చేశారు. 86 దరఖాస్తులను అర్హత లేనవిగా గుర్తించి తిరస్కరించారు. గణపురం ఆంధ్రా బ్యాంకుకు అత్యధికంగా 55, మహదేవపూర్‌ ఎస్‌బీఐ బ్యాంకుకు 41 దరఖాస్తులు వచ్చాయి. గ్రామాల వారీగా కార్డుల అందజేతకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది.

కార్డు పొందడం ఇలా..?

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పొందడానికి రైతుకు 18 నుంచి 75 ఏళ్ల వయసు ఉండాలి. వ్యవసాయ, వ్యవసాయేతర కార్యకలాపాలు చేసే వారికి ఈ కార్డులు ఇస్తారు. దరఖాస్తుకు ఓటర్‌ ఐడీ, ఆధార్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలైన వాటిలో ఏదో ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది. ఈ కార్డు ఆన్‌లైన్‌లో కూడా పొందవచ్చు. రైతుకు కావాల్సిన సమయంలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను తీసుకోవడానికి ఈ కార్డు సాధారణ క్రెడిట్‌ కార్డు మాదిరిగా ఉపయోగపడుతుంది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. కార్డుపై ఉన్న లిమిట్‌ పెంచాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. పశుసంవర్ధక, మత్స్య రంగానికి చెందిన వారికి సైతం రుణాలు కార్డు ద్వారా అందించనున్నారు.

ప్రయోజనాలు..

విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల కొనుగోళ్లు, సాగు ఖర్చుల వంటి వ్యవసాయ అవసరాల కోసం రోజు వారీ వ్యవసాయ ఖర్చులకు ఈ కార్డును ఉపయోగించవచ్చు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు కార్డు పొందవచ్చు. కొన్ని పరిమితుల మేరకు కౌలు రైతు ఈ కార్డు పొందేందుకు వీలుంది. సాధారణ డాక్యుమెంటేషన్‌ ద్వారా బ్యాంకులో పొందవచ్చు. రైతుకు బీమా కవరేజీ కూడా ప్రభుత్వం కల్పిస్తున్నది. వ్యవసాయ ఆదాయాన్ని బట్టి గరిష్ఠ రుణ పరిమితి ఉంటుంది. 

రైతులకు ఉపయోగకరం.. 


కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుం ది. ఈ కార్డును బ్యాంకర్లు మాత్ర మే రైతులకు అందజేస్తారు. కార్డు ను ఎరువులు, పురుగు మందు లు, విత్తనాల కొనుగోలుకు రైతు లు వినియోగించుకోవచ్చు. డబ్బులు మాత్రం తీసుకోరాదు. జిల్లాలో ఇప్పటి వరకు 254 దరఖాస్తులు వచ్చాయి. 75 దరఖాస్తులు అప్రూవల్‌ అయ్యాయి. 

- శ్రీనివాస్‌, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌logo