మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Oct 05, 2020 , 05:43:26

ప్రజల వద్దకే పాలన

ప్రజల వద్దకే పాలన

  • ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు చేరవేయాలి
  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌

కాటారం, అక్టోబర్‌ 4 :  ‘ఇది ప్రజల ప్ర భుత్వం... ప్రజాప్రతినిధులతో పని చేయించుకోవడం ప్రజల కర్తవ్యం... ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు.. దూరదృష్టితో ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నాయని, సీఎం పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది’ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ ర్‌ అన్నారు. కాటారంలో ఏర్పాటు చేసిన జడ్పీ చైర్‌పర్సన్‌ క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చే యాలన్నారు. కాటారం సబ్‌డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకారం అందిస్తామన్నారు.

అ నంతరం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత జక్కు రాకేశ్‌, ఎంపీటీసీ తోట జనార్దన్‌, మండలాధ్యక్షుడు డోలి అర్జయ్య, యూత్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ సన్మానించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణిని మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ సన్మానించారు. బహుజన ఫ్యామిలీ అధ్యక్షుడు కందుగుల రా జన్న, కార్యదర్శి రాజబాబు కాటారంలో అం బేద్కర్‌ భవన్‌ నిర్మాణం కోసం మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్ల నారాయణరెడ్డి, మార్క రా ముగౌడ్‌, మహిళాధ్యక్షురాలు రత్న సౌజన్య, ఎస్సీ సెల్‌ మంథని డివిజన్‌ అధ్యక్షుడు భూ పెల్లి రాజు, నాయకులు కుడుదుల రాజబా బు, వంగల రాజేంద్రచారి, జక్కిరెడ్డి, జోడు శ్రీనివాస్‌, ఊర వెంకటేశ్వర్‌రావు, జక్కు మొ గిళి, నర్సింగరావు, పంతకాని సడవలి, శ్రీల క్ష్మి, వెంకటస్వామి, శ్రీను, శంకర్‌, సత్యం, శ్రీనివాసరావు, కిరణ్‌, తాజొద్దీన్‌, బాలరా జు, మొగిళి, శ్రావణ్‌, రాజు ఉన్నారు.logo