బుధవారం 28 అక్టోబర్ 2020
Jayashankar - Oct 04, 2020 , 05:58:00

జీవవైవిధ్యంతోనే పర్యావరణ సమతుల్యత

జీవవైవిధ్యంతోనే పర్యావరణ సమతుల్యత

భూపాలపల్లి: జీవవైవిధ్యంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని పర్యావరణవేత్త దామోదర్‌, డీఎఫ్‌వో పురుషోత్తం అన్నారు వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం జిల్లా అటవీశాఖ కాన్ఫరెన్స్‌ హాలులో జీవ వైవిధ్యం, దాని ప్రాముఖ్యత, పర్యావరణ పర్యాటకం అభివృద్ధి తదితర అంశాలపై వర్క్‌షాపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వోలు, డీఆర్‌వోలు, ఎఫ్‌ఎస్‌వోలు, బీట్‌ ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలి

పలిమెల: ప్రజలందరూ వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని పలిమెల ఇన్‌చార్జి రేంజ్‌ అధికారి సురేశ్‌ అన్నారు. శనివారం జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా మహదేవపూర్‌ మండలంలోని పెద్దంపేట నుంచి పలిమెల మండలంలోని లెంకలగడ్డ వరకు మోటార్‌ సైకిల్‌ యాత్ర నిర్వహించారు. అనంతరం లెంకలగడ్డ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లెంకలగడ్డ సర్పంచ్‌ తోట రమాదేవి, సెక్షన్‌ ఆఫీసర్లు అరిస్టాటిల్‌, వినోద్‌, బీట్‌ ఆఫీసర్లు, బేస్‌ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.


logo