మంగళవారం 27 అక్టోబర్ 2020
Jayashankar - Oct 03, 2020 , 02:31:04

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీం

 భూపాలపల్లి: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం అన్నారు. జిల్లా కేంద్రం లోని అటవీ శాఖ కార్యాలయంలో శుక్రవారం జా తీయ వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అటవీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నా టారు. అక్కడే ఏర్పాటు చేసిన అటవీ జాతుల వి త్తనాలను, వన్యప్రాణులను వేటాడేందుకు ఉప యోగించే ఆయుధాలను పరిశీలించారు. అనంత రం అజీం మాట్లాడుతూ అడవుల్లో స్వేచ్ఛగా జీ వించడం వన్యప్రాణుల హక్కని, వాటి స్వేచ్ఛా జీ వితానికి ఆటంకం కలిగించడం, వేటాడడం పెద్ద నేరమన్నారు.

ఇటీవల పెద్దపులి సంచరించడం అ డవుల సంరక్షణ వృద్ధికి శుభసూచకమన్నారు. వరంగల్‌ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎంజే అక్బర్‌ మాట్లాడుతూ హరితహారం, తదితర కార్య క్రమాల వల్ల జిల్లాలో అటవీ సంపద వృద్ధి చెంది వన్యప్రాణులకు సురక్షిత ప్రాంతంగా మారుతుం దని, దీనికి  ఈ మధ్య జిల్లాలో పెద్దపులి సంచరిం చడమే నిదర్శనమన్నారు. అనంతరం వివిధ సం దర్భాల్లో వన్యప్రాణులను సంరక్షించిన అటవీ అ ధికారులు, పౌరులను సన్మానించారు. కార్యక్రమం లో డీఎఫ్‌వో కే పురుషోత్తం, ఎఫ్‌డీవో వజ్రారెడ్డి, ఎఫ్‌ఆర్వోలు, డీఆర్వోలు, ఎఫ్‌ఎస్‌వోలు, బీట్‌ ఆ ఫీసర్లు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.


logo