గురువారం 29 అక్టోబర్ 2020
Jayashankar - Oct 02, 2020 , 02:22:51

మూగజీవాలపై ప్రేమతో.. అన్నం వండి.. ఆకలి తీర్చి

మూగజీవాలపై ప్రేమతో.. అన్నం వండి.. ఆకలి తీర్చి

మనం గుడికో, అటవీ ప్రాంతానికో వెళ్లినప్పుడు కోతులు కనిపిస్తే ఏం చేస్తాం..? చేతిలో ఉన్న కొబ్బరికాయనో, అరటిపండో.. ఏదున్నా ఇచ్చేస్తాం. లేకపోతే అదే లాక్కుంటుందనుకోండి..! కానీ వీళ్లు మాత్రం కోతుల కోసం  ప్రత్యేకంగా అన్నం వండి ప్లేట్లలో వడ్డించమే గాక పండ్లు, తాగేందుకు నీళ్లు కూడా పెట్టారు. వాసవీ క్లబ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా కాటరం  క్లబ్‌ అధ్యక్షుడు మద్ది నవీన్‌, వనితా క్లబ్‌ అధ్యక్షురాలు నీరజ స్థానిక అటవీ ప్రాంతంలో ఆహారం అందించి మూగజీవాలపై తమ ప్రేమను చాటుకున్నారు. ఆ తర్వాత గోపూజ చేసి ఆవుల ఆకలి తీర్చారు. ఆహారం అందజేయడంపై వారిని స్థానికులు అభినందించారు.

- కాటారం


logo