ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Oct 01, 2020 , 03:05:14

రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌

మల్హర్‌ : రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని కొయ్యూరు పరిధిలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కొయ్యూరు జీపీకి నూతన భవనం కావాలని సర్పంచ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించారు. కలెక్టర్‌ వెంట సర్పంచ్‌ సిద్ధ లింగయ్య, ఎంపీడీవో ప్రకాశ్‌ రెడ్డి, డీఈ సాయిలు, ఏఈ అశోక్‌, ఏఈవో శైలజ, సెక్రెటరీ ప్రసాద్‌ తదితరులున్నారు.


logo