ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Sep 29, 2020 , 05:05:17

నిషేధిత పొగాకు ఉత్పత్తుల పట్టివేత

నిషేధిత పొగాకు ఉత్పత్తుల పట్టివేత

టేకుమట్ల: మండల కేంద్రంలోని కిరాణా షాపు ల్లో టాస్క్‌ఫోర్స్‌, టేకుమట్ల పోలీసులు దాడులు నిర్వహించి, రూ. 40వేల విలువల గల అంబర్‌, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. యజమానుల పై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ మో హన్‌, టేకుమట్ల ఎస్సై రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రా నికి చెందిన  నాసర్‌, వేణు, రాజేశ్వర్‌రావు, రంజి త్‌, ప్రశాంత్‌కు చెందిన షాపులను తనిఖీ చేశామ న్నారు. వారి దుకాణాల్లో సరుకులతోపాటు రూ. 40 వేల విలువ గల అంబర్‌, గుట్కాలను నిల్వ చేయడాన్ని గుర్తించామన్నారు. వాటిని  స్వాధీనం చేసుకుని, వ్యాపారులు సహా టేకుమట్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, ఎస్సైకి అప్పగించామన్నారు. కాగా ఐదుగురి వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు.  ఈ దాడుల్లో టాస్క్‌ ఫోర్స్‌ ఏఎస్సై గోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, రవీం దర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. logo