ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Sep 29, 2020 , 05:05:21

రక్షణ సూత్రాలు పాటించేలా చూడాలి

రక్షణ సూత్రాలు పాటించేలా చూడాలి

  • గనుల్లో ఉద్యోగులపై అధికారుల   పర్యవేక్షణ ఉండాలి
  • ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి 
  • జీఎం(సీజీఎం) నాగభూషణ్‌ రెడ్డి

 భూపాలపల్లి: ఉద్యోగులు రక్షణ సూత్రాలు పాటించేలా ఏరియా, గని స్థాయి సంబంధిత అధికారులు సరైన పర్యవేక్ష ణ చేయాలని కార్పొరేట్‌ జీఎం(సీజీఎం) కే నాగభూషణ్‌రెడ్డి ఆదేశించారు. భూపాలపల్లి ఏరియా భూగర్భ గనుల్లో ప్రమా  దాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆయన సోమవారం  పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏరియాలోని అన్ని గనులను సందర్శించి చేపట్టిన రక్షణ చర్యల విషయమై సమీక్ష చేశారు. గనుల పనిస్థలాల మ్యాప్‌లను పరిశీలించా రు. ప్రధానంగా కేటీపీపీకి అవసరమైన బొగ్గును అందించా ల్సి ఉన్నందున కేటీకే ఓసీపీ-2 గని క్వారీలో ఉన్న వర్షపు నీ టిని యుద్ధప్రాతిపాదికన వారం రోజుల్లో బయటకు పంపిం గ్‌ చేసి పూర్తిస్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని నాగభూషణ్‌రెడ్డి ఆదేశించారు.

అంతకు ముందు గనిలో ఇంకా రెండు కోట్ల గ్యాలన్ల వర్షపు నీరు ఉందని, ప్రస్తుతం రోజుకు 1500 నుంచి 2వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని గని అధికారులు వివరించారు. నూతనంగా చేపట్టిన కేటీకే ఓసీపీ-3 గనిని సందర్శించి మట్టి తవ్వకపు పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి, ఈ సంవత్సరం డిసెంబర్‌ నాటికి బొగ్గు ఉత్పత్తి చేసేలా  అధికారులు సమష్టిగా ముందుకు సాగాలని  సూచించారు. ఆయన వెంట స్థానిక జీఎం సీహెచ్‌ నిరీక్షణ్‌రాజ్‌, ఎస్‌ వోటూ జీఎం జీ రఘుపతి, కేటీకే ఓసీపీ-2,3 పీవోలు జాన్‌ ఆనంద్‌, విజయ ప్రసాద్‌, ఏజెంట్‌ బీవీ రమణ, ఏఎస్‌వో ర వీందర్‌, గనుల మేనేజర్లు వెంకటేశ్వర్‌రావు, జాకీర్‌హుస్సేన్‌, కృష్ణప్రసాద్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, ఆయా గనుల డిప్యూటీ మేనేజర్లు, సేఫ్టీ, వెంటిలేషన్‌ ఆఫీసర్లు, తదితరులు ఉన్నారు.


logo