శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Sep 29, 2020 , 05:05:14

కాళేశ్వరం పాలకమండలి చైర్మన్‌గా రాంనారాయణగౌడ్‌

కాళేశ్వరం పాలకమండలి చైర్మన్‌గా రాంనారాయణగౌడ్‌

కాళేశ్వరం : శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా గంట రాంనాయణగౌడ్‌ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత చైర్మన్‌ బొమ్మర వెంకటేశం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా దే వాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అభిషేక మండప ఆవరణలో ఈవో మారుతి ఆధ్వర్యంలో ధర్మకర్తల కమిటీ రాంనారాయణను చైర్మన్‌గా ఎన్నుకుంది.

అనంతరం స్వామి వారి శేషవస్ర్తాలతో సన్మానం చేసి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ, ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్‌ విడుదల చేసిన నిధులతో పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఆలయ కమిటీ పదవీకాలం వచ్చే నెల 23న ముగియనుంది. కార్యక్రమంలో ధర్మకర్తలు ఓగేశ్‌, సంజీవరెడ్డి, శ్రీహరి, సత్యనారాయణ, కృష్ణారెడ్డి, రామ్‌సింగ్‌, సత్యనారాయణ, దేవేందర్‌రెడ్డి, రమేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భవాని, ఎంపీటీసీ మమత, సర్పంచ్‌ వెన్నపురెడ్డి వసంత ఉన్నారు.