ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Sep 27, 2020 , 07:36:04

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం

భూపాలపల్లి టౌన్‌, సెప్టెంబర్‌ 26: ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్‌ లక్ష్మీధర్మ అన్నారు. శనివారం ఆయన భూపాలపల్లిలోని డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బస్సుల్లో రోజుకు రెండు సార్లు హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నామని తెలిపారు. కండక్టర్లకు శానిటైజర్‌ బాటిల్స్‌ అందజేసినట్లు చెప్పారు. డిపోలో 390 మంది సిబ్బంది పనిచేస్తుండగా కేవలం 17 మందికే కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో భూపాలపల్లి డిపో లాభాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జూన్‌ 19న కార్గో పార్సిల్‌ సర్వీస్‌ను ప్రారంభించగా రోజుకు రూ. 4 వేల ఆదాయం వస్తున్నదని అన్నారు. హన్మకొండ, భూపాలపల్లి, కాళేశ్వరం,  సీరొంచ, చెన్నూరు, మంచిర్యాల రూట్లలో సర్వీసును ప్రారంభించామన్నారు. ఉదయం 7:15 గంటలకు హన్మకొండలో బస్సు బయలుదేరుతుందన్నారు. అలాగే భూపాలపల్లి నుండి మోరంచపల్లి, జడలపేట, టేకుమట్ల, రాఘవపూర్‌, సీతంపేట మీదుగా జమ్మికుంటకు సర్వీసును ప్రారంభించామన్నారు. సంస్థ ఆధ్వర్యంలో డ్రైవర్‌ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రూ.15,600 ఫీజుతో 36 గంటల ఇస్తున్నట్లు వివరించారు.  


logo