గురువారం 29 అక్టోబర్ 2020
Jayashankar - Sep 26, 2020 , 06:37:41

వైద్య సిబ్బందికి కలెక్టర్‌ అభినందన

వైద్య సిబ్బందికి కలెక్టర్‌ అభినందన

భూపాలపల్లి కలెక్టరేట్‌: చిట్యాల  మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ కాయకాల్ప అవార్డులో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాన్ని పొందడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను  కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అభినందించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా దవాఖానల్లో పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడంతోపాటు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందిస్తున్నందుకు  ఈ అవార్డు వచ్చిందని అభినందించారు. జిల్లాలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రశంసనీయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మహదేవపూర్‌ మండలంలోని అంబటిపల్లి, టేకుమట్ల మండలంలోని వెలిశాల, మహాముత్తారం, మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎన్‌యూహెచ్‌ఎం కింద భూపాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం ఎంపికైనట్లు కలెక్టర్‌ తెలిపారు.


logo