మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Sep 26, 2020 , 06:37:41

కోర్టుకు అదనపు గదులు కేటాయించండి

కోర్టుకు అదనపు గదులు కేటాయించండి

భూపాలపలి: కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా కోర్టును నడపడానికి ప్రస్తుతం కేటాయించిన భవనంతోపాటు ఖాళీగా ఉన్న అదనపు గదులను కూడా కేటాయించాలని కోరుతూ జయశంకర్‌ భూపాలపల్లి  జిల్లా కేంద్రంలోని న్యాయవాదులు

శుక్రవారం భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఈ. సీహెచ్‌ నిరీక్షన్‌రాజ్‌ను తన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటుకు పాత నగర పంచాయతీకి  కేటాయించిన భవనాన్ని సింగరేణి యాజమాన్యం ఇదివరకే కేటాయించింది. దీనికి ఆనుకుని ఉన్న సింగరేణి అదనపు గదులను కూడా కేటాయించాలని న్యాయవాదులు జీఎంను కోరారు. జీఎం సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదులు తెలిపారు. న్యాయవాదులు వలబోజు శ్రీనివాసాచారి, మహ్మద్‌ రఫీ, సంగెం రవీందర్‌, మంగళంపల్లి రాజ్‌కుమార్‌, ఎస్‌. చిరంజీవి పాల్గొన్నారు.logo