బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Sep 25, 2020 , 06:36:12

జిల్లాకు చేరినబతుకమ్మ చీరెలు

జిల్లాకు చేరినబతుకమ్మ చీరెలు

  • మండలాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు 
  • త్వరలో పంపిణీకి శ్రీకారం

జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తేతెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక  బతుకమ్మ పండుగ. ఈ పండుగను ఆడపడుచులు సంబురంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభిరుచికి  తగ్గట్టుగా తీరొక్క రంగులు, అంచులతో చీరెలను తయారు చేయించింది. ప్రతి ఏడాది చీరెలను పండుగ కానుకగా అందిస్తున్నది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభంకానున్న బతుకమ్మ పండుగకు ముందే చీరెలు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చీరెలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.  సింగరేణి ఫంక్షన్‌హాల్లో వీటిని భద్రపరిచారు. అదనపు కలెక్టర్‌, డీఆర్డీఏ ఇన్‌చార్జి పీడీ వైవీ గణేశ్‌ చీరెలను మండల కేంద్రాలకు పంపించే ప్రక్రియను ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ సహకారంతో రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నారు. 11 మండలాల్లో తెల్ల రేషన్‌ కార్డులున్న 1,46,634 మంది మహిళలకు లబ్ధిచేకూరనుంది. 

మండలాలకు చేరనున్న చీరెలు..

అర్హులైన తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా అం దించనున్న చీరెలు జిల్లా కేంద్రానికి వచ్చాయి. జిల్లాకు 952 బండిళ్లు చేరగా ప్రతి బండిల్‌లో 160 చీరెల చొప్పున 1,52,320 అందుబాటు లో ఉన్నాయి. మండలాలకు  కేటాయించిన లెక్కల ప్రకారం 1,46,634 చీరెలు తరలించనున్నారు.  

మండలాల వారీగా వివరాలు 


మండలం పేరు చీరెల సంఖ్య

జయశంకర్‌ భూపాలపల్లి 23,990

చిట్యాల 14,033

గణపురం 13,559

కాటారం 13,465 

పలిమెల 2,600

మహాముత్తారం 10,005

మహదేవపూర్‌ 11,936

మల్‌హర్‌రావు 10,287

మొగుళ్లపల్లి 13,585

రేగొండ 23,161

టేకుమట్ల 10013

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం  పంపిణీ

బతుకమ్మ చీరెలు  పూర్తిగా జిల్లాకు చేరాయి. జిల్లాలోని స్టాక్‌ పాయింట్‌ నుంచి 11 మండలాలకు పంపిణీ చేస్తున్నాం. మండలాల నుంచి గ్రామాలకు తరలిస్తారు. ప్రభుత్వం తేదీలను ప్రకటించగానే అన్ని గ్రామాల్లో పంపిణీ చేస్తాం.  

-వైవీ గణేశ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌logo